మహేష్ '1నేనొక్కడినే' కూడా ఆడాలి: చెర్రీ అభిమతం

By Pratap

హైదరాబాద్: సంక్రాంతికి విడుదలయ్యే తన ఎవడు సినిమాతో పాటు మిగతా హీరోల సినిమాలు కూడా విజయవంతం కావాలని రామచరణ్ తేజ్ ఆశించాడు. సంక్రాంతికి విడుదలవుతున్న మహేష్ బాబు 1 నేనొక్కడిని ఉద్దేశించే చెర్రీ ఆ మాటలు అన్నాడని భావిస్తున్నారు. ఎవడు సినిమా జనవరి 12వ తేదీన విడుదలవుతుండగా, మహేష్ 1నేనొక్కడినే పదో తారీఖును విడుదలవుతుంది.

హైదరాబాదులోని సంధ్య థియేటర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎవడు సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అబిమానుల కోరిక మేరకు ఎవడు సినిమాలోని ఓ డైలాగు కూడా చెప్పారు. తాను సినిమా ప్రమోషన్‌ కోసం రాలేదని, తనకు సినిమాను ప్రమోట్ చేయడం రాదని, అభిమానుల మధ్య గడపడానికి మాత్రమే వచ్చానని చెర్రీ అన్నారు.

సంక్రాంతి బహుమతిగా ఎవడు సినిమా వస్తోందని ఆయన అన్నారు. సినిమా విడుదల సమయంలో జాగ్ర్తత్తగా అభిమానులు ఆనందాన్ని ప్రదర్శించాలని, అభిమానులకు ఏమైనా అయితే సినిమా విజయం సాధించినా తమకు ఆ ఆనందం ఉండదని ఆయన అన్నారు. సినిమా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానని ఆయన అన్నారు.

డైలాగ్ చెప్పడం ఇక్కడ రాదని, అయితే తనకు సభకు వచ్చి డైలాగులు చెప్పకూడదనే పట్టింపులు తనకు లేవని, తడితే చెప్తానని, లేకుంటే చెప్పనని, మీ కోరికకు మించింది ఏదీ లేదు అంటూ ఆయన ఓ వాక్యం డైలాగు చెప్పేశారు. అభిమానులకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి విడుదలయ్యే మిగతా సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నానని, నటులందరూ బాగుండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోండని, కుటుంబ సభ్యులతో కలిసి ఎవడు సినిమా చూడండని, ఇది కుటుంబ సభ్యులతో కలిసి చూసే సినిమా అని రామ్ చరణ్ తేజ్ అన్నారు. దిల్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

<center><center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/m9h976hfKCc?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center></center>

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X