రామ్ చరణ్ కొత్త హాబీ అదే
రామ్ చరణ్ తాను కొత్తగా పోలో గేమ్ ని ఆడటం హాబీగా మార్చుకున్నానని ట్విట్టర్ లో రాసారు. తన వివాహ విషయమై అందరినీ నుండి కంగ్రాట్స్ మెసేజ్ లు అందుకుంటున్న చరణ్ చాలా ఉషారుగా ఉన్నారు.రచ్చ షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్ కి ఖాళీ దొరికినప్పుడల్లా పోలో ప్రాక్టీసు చేస్తున్నట్లు చెప్తున్నారు.అలాగే రామ్ చరణ్ తన తాజా చిత్రం రచ్చ గురించి ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో రచ్చ చేస్తున్నాడు.పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.
తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగు ఇటీవల శ్రీలంకలో చిత్రీకరించారు. రామ్ చరణ్ తో బాటు తమన్నా పాల్గొన్న ఈ షూటింగులో రెండు పాటలను, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు.


Click it and Unblock the Notifications











