twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్క్ర్రిప్టు మార్చమన్న రామ్ చరణ్

    By Srikanya
    |

    బొమ్మరిల్లు భాస్కర్ తయారుచేసిన స్క్రిప్టు మొత్తం విన్న రామ్ చరణ్ తేజ అందులో కొన్ని మార్పులు చేయమన్నట్లు సమాచారం. చరణ్ చెప్పిన మార్పులు కోసం భాస్కర్ తమ స్క్రిప్టు టీమ్ తో తిప్పలు పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెకెండాప్ లో వచ్చే ఎపిసోడ్స్ లోనే ఈ మార్పులు చెప్పినట్లు చెప్పుకుంటున్నారు. భాస్కర్ ఎప్పటిలాగే సాఫ్ట్ గా హీరోయిజం ప్రక్కన పెట్టి కథనం తయారు చేసాడని అందుకే ఈ మార్పులు అని అంటున్నారు. ఇక షూటింగ్ కూడా న్యూయార్క్ లో కాకుండా పూర్తిగా ఆస్ట్రేలియాలో జరుపుదామని సూచించాడని వినికిడి. న్యూయార్క్ లో సీజన్ ఛేంజ్ అవుతుందని అందుకే ఈ మార్పుని అతని సన్నిహితులు అంటున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జెనీలియా, కృతి కర్భంధన చేస్తున్నారు. అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవరిస్తారు. హరీష్ జయరాజ్ సంగీతం, మార్తాండ్ కె.వెంకటెష్ ఎడిటింగ్, ఆర్ట్ ఆనంద్ సాయి, కెమెరా కిరణ్ రెడ్డి అందిస్తున్నారు. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా ఆరంజ్ ని పెట్టారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X