ఉపాసన డామినేట్ చేస్తే సంతోషిస్తా: చెర్రీ

By Pratap

ఉపాసన తనను డామినేట్ చేస్తే సంతోషిస్తానని మెగాస్టార్ చిరంజీవి తనయుడు, తెలుగు సినీ హీరో రామ్ చరణ్ తేజ్ అన్నారు. ఆయన ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌తో ప్రత్యేకంగా ఆ వ్యాఖ్య చేశారు. నిశ్చితార్ధానికి మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌కు చేరుకున్నప్పుడు ఆ టీవీ చానెల్ చెర్రీని పట్టుకోగలిగింది. బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నిశ్చితార్ధానికి రావడం సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కారు నడుపుతూ చెర్రీని నిశ్చితార్థం వేదిక వద్దకు తీసుకుని వచ్చారు.

రామ్ చరణ్ తేజ్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా బెంజ్ కారును తెప్పించారు. కోటిన్నర రూపాయల విలువ చేసే బెంజ్ కారులో రామ్ చరణ్ తేజ్‌ను ఫామ్ హౌస్‌కు తీసుకుని వచ్చారు. అంతకు ముందు తన నివాసం నుంచి పవన్ కళ్యాణ్ చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. రామ్ చరణ్ తేజ్‌ను కారులో కూర్చోబెట్టుకుని తానే కారును నడుపుతూ మొయినాబాద్ ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. నిశ్చితార్థం వేదికను అంగరంగ వైభవంగా తీర్చి దిద్దారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X