మగధీర గురించి రామ్ చరణ్ తేజ

By Staff

త్వరలో విడుదల కానున్న తన మగధీర చిత్రం గురించి హీరో రామ్ చరణ్ తేజ మీడియాతో మాట్లాడారు. 'మగధీర' అనుభవాల్ని చరణ్‌ వివరిస్తూ..."గుజరాత్‌లో తీసిన గుర్రం ఎపిసోడ్స్‌ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే 'బంగారు కోడిపెట్ట...' పాట కూడా. ఒకప్పుడు నాన్నగారు అదరగొట్టేసిన ఈ పాటను ఇప్పుడు నేను చేస్తుంటే చాలా ఉద్వేగపడ్డాను. ఇక కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రాణం. కచ్చితంగా ఈ సినిమా రీ-రికార్డింగ్‌ ట్రాక్స్‌ని ఆడియో సీడీలుగా రిలీజ్‌ చేయొచ్చు. మహామహులైన టెక్నీషియన్స్‌ ఈ సినిమాకి పనిచేశారు. కెమెరామన్‌ సెంథిల్‌కి హేట్సాఫ్‌ చెప్పాలి. అంత బాగా ఫొటోగ్రఫీ సమకూర్చారాయన' అని తెలిపారు.ఇక ఈ సినిమా తనకే కాదు తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలుస్తుందనే అంచనాలో ఉన్నారు చరణ్‌. నిజంగా ఈ సినిమా చేయడం తన అదృష్టమని చెబుతున్నారాయన. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో...భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది. కాజల్‌ అగర్వాల్‌, శ్రీహరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సహనిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X