ఇదే నా స్త్టెలింగ్: రామ్ చరణ్
ఇక మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఎవడు' చిత్రం విడుదలకు భారీగా సిద్దమవుతోంది. అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు ఓ ప్రకటన ద్వారా క్లియర్ చేసి తెలిపిన సంగతి తెలిసిందే. దాంతో అబిమానులు ఉత్సాహంగా ఉన్నారు.. ఇందులో రామ్ చరణ్ నటవిశ్వరూపం చూస్తారని, తెలుగు సినిమాను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లే సినిమా ఇదని నిర్మాత దిల్ రాజు జు నమ్మకం వ్యక్తం చేశారు.
''పైడిపల్లి వంశీ 'ఎవడు' రూపంలో ఓ అద్భుతాన్నే ఆవిష్కరించాడని చెప్పాలి. అల్లు అర్జున్ ఇందులో పది నిమిషాలే కనిపిస్తారు. కానీ ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం కనిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తున్నాయి. మా సంస్థ నుంచి రాబోతున్న బ్లాక్బస్టర్ ఇది. అక్టోబర్ 10న అత్యధిక థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు.
శుతిహాసన్, అమీజాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో కాజల్ అతిథి పాత్ర పోషించారు. జయసుధ, కోట శ్రీనివాసరావు, సాయికుమార్, రాహుల్దేవ్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: ఆనంద్ సాయి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications












