ఈ సినిమా నాకో సవాల్: రామ్ చరణ్
''ఈ సినిమా నాకో సవాల్. తప్పకుండా ఈ సినిమాతో అందరి అంచనాలను అందుకొంటాను. బిగ్‌బి పోషించిన పాత్ర నాకు దక్కడం సంతోషంగా ఉంది'' అని రామ్ చరణ్ చెప్పారు. ఆయన తాజాగా హిందీలో ఆనాటి సూపర్ హిట్ 'జంజీర్'రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. 'జంజీర్' రీమేక్ చేయటం ద్వారా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న రామ్ చరణ్..పాత్రను ఛాలెంజ్ గా తీసుకున్నానని చెప్తున్నారు.
రామ్‌చరణ్ సరసన ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్ జరుగుతోంది. రామ్ చరణ్, ప్రకాష్‌రాజ్‌లపై పోరాట సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. చిరుత చిత్రం కూడా బ్యాంకాక్ లోనే షూటింగ్ జరగటంతో ఈ చిత్రం కూడా బ్యాంకాక్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
'జంజీర్' నలభై ఏళ్ల క్రితం బాలీవుడ్‌లో సంచలనం. అప్పటి వరకూ ప్రేమకథలూ, వినోదాత్మక చిత్రాలకే పరిమితమైన ప్రేక్షకులకు యాక్షన్ సినిమాల రుచి చూపించింది. దాంతోనే అమితాబ్‌బచ్చన్ యాంగ్రీ యంగ్‌మెన్ ఇమేజ్‌ని సొంతం చేసుకొన్నారు. అలాగే ఈ చిత్రం ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు.
గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.


Click it and Unblock the Notifications











