రామ్ చరణ్ బి.ఎస్‌కు ఎడిక్ట్ అయ్యాడా?
మెగా తనయుడు రామ్ చరణ్ తేజ బిఎస్ కు ఎడిక్ట్ అయ్యాడనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశం అయ్యాయి. ఈ మధ్య చరణ్ వాలకం చూసిన ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థం అయిపోతుంది. బి.ఎస్ అంటే కొంపతీసి బ్రౌన్ షుగర్ అనే మత్తు పదార్థం అనుకునేరు..అస్సలు కాదండీ బాబు. బిఎస్ అంటే బ్లూ కలర్ షూ. ఈ మధ్య మీరు పబ్లిక్ ఫంక్షన్లలో చరణ్ ను చూశారా? ఆయన ఏ రంగు షూ వేసుకొచ్చారో గమనించారా? గమనించక పోతే మరోసారి వచ్చినప్పడు చూడండి అవే...అవే బూట్లు దర్శనం ఇస్తాయి.
ఏ కార్య్రకమం జరిగినా డిఫెరెంట్ డ్రెస్సింగ్ తో ఫ్యాషనబుల్ గా దర్శనం ఇచ్చే రామ్ చరణ్...ఈ మధ్య ఒకే షూ(నీలి రంగువి) వేసుకుని దర్శనం ఇస్తున్నాడు. ఆయన వేసుకునే డ్రెస్సుకు అవి మ్యాచ్ కాకున్నా సరే...ఎక్కడికెళ్లినా వాటినే వేసుకొస్తున్నాడు. ధీంతో చరణ్ వాటికి ఎడిక్ట్ అయ్యాడని సీనీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
తనకు కాబోయే భార్య..ఉపాసన వాటిని చరణ్ కు బహూకరించిందని, ఉపాసనపై తనకున్న ప్రేమను చాటు కోవడానికి వేసిన షూలనే మళ్లీ మళ్లీ వేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చరణ్ ప్యాషన్ ఇమేజ్ స్పాయిల్ అవుతోందని కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











