twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ రాజకీయం, యూత్‌కు అడ్వైజ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చాలా మంది తెలుగు యాక్టర్స్ రాజకీయాలు గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. రాజకీయాల ప్రస్తావన తెస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని కొందురు, రాజకీయాలంటే మురికి కుంట అని కొందరు రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు.

    ఇటీవల తన తాజా సినిమా నాయక్ సక్సెస్ టూర్లో పాల్గొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ... యువత రాజకీయాలకు రెస్పెక్ట్ ఇవ్వాలని, రాజకీయాలను గురించి తెలుసుకోవాలని అడ్వైజ్ ఇచ్చారు. యువత రాజకీయ జ్ఞానం కలిగి ఉండాలని, అప్పుడే దేశంలో మంచి పరిపాలన వ్యవస్థ ఏర్పాడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

    ఓ మూవీ పోర్టల్ తో మాట్లాడుతూ రామ్ చరణ్ రాజకీయాలపై తన స్టాండ్ ఏమిటో వివరించారు. రాజకీయాలు, రాజకీయ నాయకులన్నా తనకు ఎంతో ఆసక్తి అని చెప్పుకొచ్చారు. యువత రాజకీయాలపై ఆసక్తి చూపాలని, దేశం, ప్రభుత్వం, మన పాలకులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

    రామ్ చరణ్‌కు ఉన్నట్టుండి రాజకీయాలపై ఇంత ఇంట్రెస్ట్ ఎలా కలిగిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం...... పార్టీని నడిపించడం అంటే సినిమాలు చేసినంత వీజీ కాదని తెలుసుకోవడం, సామాజిక న్యాయం సాకుతో కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

    English summary
    When most of the young Telugu actors either hate or afraid to talk about politics, Ram Charan Teja, who is next most-adored Tollywood star after Pawan Kalyan and Mahesh Babu, dares to say that he likes it. The young actor, who is basking in the success of his recent release Nayak, even advises youth to like and respect politics. He also asks them to be aware of everything.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X