రామ్ చరణ్ రచ్చ తర్వాత క్లాసా..మాసా..మెగాఫ్యాన్స్ టెన్షన్..!?
ఆరంజ్ లో లవర్ బాయ్ గా కనిపించిన రామ్ చరణ్ వెంటనే తన పంథా మార్చి మాస్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. అదే రచ్చ సినిమా. 'ఏమైంది ఈ వేళ' ఫేం సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకుడు. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్ బి చౌదరి సమర్పణలో ఎన్ వి ప్రసాద్, పారాస్ జైన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్నా ఇందులో హీరోయిన్ గా చేస్తోంది.. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.
రామ్ చరణ్ 'రచ్చ' తర్వాత .. ఏమిటనేది సస్పెన్స్ గానే కొనసాగుతుంది. రెండు సినిమాలు కమిట్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఒకటి 'మున్నా' 'బృందావనం' ఫేం 'పైడపల్లి వంశీ' దర్శకత్వం వహించే దిల్'రాజు' చిత్రం ఒకటి కాగా, 'పైడపల్లి వంశీ' అంటే ఇష్టం, నమ్మకం వున్నాయి. బృందావనంలా క్లాస్, మాస్త్ కానీ గెటప్ వేయిస్తాడా..లేక ఆరంజ్ లా క్లాస్ గెటప్ వేయిస్తాడో లేక హీరో చేత మాస్ కు నచ్చని ఎటువంటి గెటప్ వేయిస్తాడెమో నని భయం మెగా ఫ్యాన్స్ లో ఉంది..
రెండవది మాస్ దర్శకుడిగా పేరొందిన వి వి వినాయక్ దర్శకత్వం వహించే చిత్రం. డివి దానయ్య నిర్మాత. ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా, కోటన వెంకట్ డైలాగులతో మాస్ చిత్రంగా వివి వినాయక్ చిత్రం కచ్చితంగా మాస్ ను అభిమానులను ఆకట్టుకుంటుంది. బద్రినాథ్ తర్వాత వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది కావడం విశేషం. 'బద్రినాథ్" ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ వివి వినాయక్ ప్రత్యేక దృష్టిపెడుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











