'మగధీర' రామ్ చరణ్ లవర్ బోయ్ లా...
"వీరుడిగా, ధీరుడిగా 'మగధీర'లో కనిపించిన చరణ్..ఇందులో లవర్ బోయ్ లా కనిపించనున్నారు. చరణ్ పాత్రను ఎంతో క్యూట్ గా మలిచారు భాస్కర్. హృదయాలను హత్తుకునే భావోద్వేగాలతో పాటు, మాస్ కు కావాల్సిన వాణిజ్యఅంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి అంటున్నారు నాగేంద్రబాబు. ఆయన తమ బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న ఆరెంజ్ చిత్రం విశేషాలను పై విధంగా వివరించారు. జెనీలియా, షాజన్ పదంసీ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా మీడియాను కలిసిన నాగబాబు చిత్ర విశేషాలు తెలిపారు.
ఆయన మాటల్లోనే...హేరిస్ జైరాజ్ సంగీతం, ఆర్డీ రాజశేఖర్ కెమెరా విజువల్స్ ఇందులో హైలైట్స్ గా నిలుస్తాయి. సాధారణంగా భాస్కర్ సినిమాల్లో కనిపించే ఫీల్ ఇందులో కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ముంబయ్‌ల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. మంగళవారం హైదరాబాద్ లో షెడ్యూల్ మొదలైంది. వారం రోజులు జరిగే ఈ షెడ్యూల్‌లో హీరోకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం'అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్.


Click it and Unblock the Notifications











