కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి రామ్ చరణ్
హైదరాబాద్ : 2013 సంవత్సరం టాలీవుడ్‌కి గ్రేట్ ఇయర్ గా చెప్పుకొవచ్చు. మే 15 నుంచి మే 26 వరకు జరిగే ఈ అంతర్జాతీయ చిత్రోత్సవానికి టాలీవుడ్ నుంచి ఇద్దరు హాజరై రెడ్ కార్పెట్‌పై నడవబోతున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూతురు ప్రియాంక దత్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికయిన సంగతి తెలిసిందే.
తాజాగా అందిన సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నడవబోతున్నారు. జంజీర్ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి రామ్ చరణ్ అక్కడికి వెలుతున్నారు. అక్కడ చెర్రీ పలువురు ఇంటర్నేషనల్ సినీ ప్రముఖులను కలవనున్నాడు. 2013 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ అధ్యక్షతన జరుగనున్నాయి.
జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రామ్ చరణ్ రేంజి ఒక్కసారిగా పెరిగి పోయింది. దీంతో పలువురు నిర్మాతలు ఆయనకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తూ డేట్స్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ జంజీర్ తో పాటు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రం చేస్తున్నాడు.
ఈ చిత్రం తర్వాత 'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక జంజీర్ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











