మొన్న జూ ఎన్టీఆర్-నిన్న అల్లు అర్జున్-నేడు రామ్ చరణ్ తేజ్!
మొన్న జూనియర్ ఎన్టీఆర్, నిన్న అల్లు అర్జున్ లు బుల్లితెర డాన్స్ షోలలో కనిపిస్తే..ప్రస్తుతం మగధీర కూడా అందుకు సిద్దం అవుతున్నాడు.'మా" టీవి నిర్వహిస్తున్న 'ఘర్షణ" డాన్స్ షోలో చరణ్ కనిపించి డాన్స్ చేయబోతున్నాడు. మా టీవీ యాజమాన్యంలో ఒకరుగా చెప్పుకునే చిరు తన తనయుడిని రంగంలోనికి దింపి త'మా" ఛానెల్ టిఆర్ పి రేటింగ్ ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెర వెనుక సమాచారం. ఇదిలా ఉంటే చరణ్ తమ షోకి రావడం వల్ల మంచి పబ్లిసిటీ, మంచి పేరు వస్తున్నాయని ఆనందపడుతున్నారు షో నిర్వాహకులు.
ఇవన్నీ ప్రక్కన పెడితే టాలీవుడ్ లో బిజీహీరోగా చరణ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడని పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి. ఒక వైపు తను నటిస్తున్న షూటింగ్ లతో పాటు మరో వైపు కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహిరిస్తున్న చరణ్ రెండు చేతులా సంపాదిస్తున్నాడని కూడా సమాచారం.
ప్రస్తుతం చరణ్ 'ఆరంజ్", 'మెరుపు" చిత్రాలతో పాటు 'పెప్సీ", 'ఎయిర్ టెల్" కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే..తాజాగా బుల్లితెర డాన్స్ షో ఇవన్నీ చూస్తుంటే అర్థం అవుతుంది..కదా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. అందుకే చరణ్ కూడా అన్నింటిలోనూ బిజీ అయిపోయాడు.


Click it and Unblock the Notifications











