Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అయ్యప్ప మాల వేసుకున్న రామ్ చరణ్
ఎంగేజ్ మెంట్ కు ముందే శబర్ మలై కి వెళ్లటానికి రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి చిరంజీవిలా అయ్యప్పమాల వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. నిన్న గురువారం నాడు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్య సాయి నిగగామగం లో రామ్ చరణ్ ఈ మాల వేయించుకున్నారు. రామ్ చరణ్ ,ఉపసనా ప్రేమ విషయం ఇరు వైపుల పెద్దలూ చీకటి తర్వాత కలవొద్దని కండీషన్ పెట్టారు. కానీ షూటింగ్ అయ్యేసరికి సాయింత్రం ఆరు అయిపోతుంది.కాబట్టి ఆ టైమ్ లో కలవటం కష్టమేనని తేల్చి చెప్పాడు రామ్ చరణ్ . పెళ్ళికి ముందు అనవసరంగా అందరి దృష్టిలో పడటం ఎందుకు అందులో మీడియా దృష్టి అంతా ఈ ఇద్దరి పైనే కాన్సర్టేట్ చేసి ఉంటుందని అలా కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.అలాగే దోమకొండ వివాహం ఆమె ఆలోచనే అని చెప్పాడు.అలాగే ఆమె నన్ను అడిగిన పెద్ద ప్రశ్న మనం స్నేహితులం అయిన దగ్గరనుండీ నువ్వు దాదాపు ఇతర దేశాల్లోనే ఉంటున్నావు..షూటింగ్ ల కోసం..మన పెళ్లయ్యాక కూడా ఇదే కొనసాగుతుందా అని అడిగింది.
అయితే ఆమె అడిగిన దాంట్లో నిజముంది నా మొదటి సినిమా చిరత కోసం బ్యాంకాక్ లోనూ ,ఆ తర్వాత మగధీర కోసం చాలా ప్రదేశాలు తిరిగాం.ఇప్పుడు రచ్చ కోసం శ్రీలంకలో షూటింగ్ జరుతున్నాం.నా కెరీర్ కి అది తప్పదు.కాబట్టి ఆమెను కూడా నాతో షూటింగ్ లకు రావచ్చు అని చెప్పాను. అయితే ఆమె కూడా వర్కింగ్ ఉమెన్.ఆమె అర్దం చేసుకుంటుందనే భావిస్తున్నాను. అయితే నేను కనపడకపోతే ఆమె కంగారు పడుతుంది అని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.