చెర్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్చిరంజీవి బ్లడ్ బ్యాంక్(ఫోటోలు)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 28వ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద వేడుక నిర్వహించారు. ప్రముఖ నిర్మాత, రామ్ చరణ్ మేనమామ అల్లు అరవింద్ ఈ వేడుకల్లో పాల్గొని కేక్ చేసారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు రక్తదానం చేసారు.
ఈ సందర్భంగా చెర్రీ ఫ్యాన్స్ మాట్లాడుతూ రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన సినిమాలు చేస్తూ కలకాలం అభిమానులు ఎంటర్ టైన్ చేస్తూ ఉండాలని, జాతీయ స్థాయిలో రాణించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రామ్ చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్

రామ్ చరణ్ బర్త్ డే కేకును కట్ చేస్తున్న అల్లు అరవింద్

అల్లు అరవింద్ కు బొకే అందజేస్తున్న రామ్ చరణ్ అభిమానులు

రక్తదానం చేస్తున్న అభిమానులు

రామ్ చరణ్ బర్త్ డే కేక్
ప్రస్తుతం రామ్ చరణ్ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి బాలీవుడ్ మూవీ 'జంజీర్' కాగా, మరొకటి తెలుగులో రూపొందుతున్న 'ఎవడు'. 'జంజీర్' చిత్రం వేసవిలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేయనున్నారు. అదే విధంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న మరో చిత్రం 'ఎవడు' చిత్రం కూడా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
వీటి తర్వాత చెర్రీ నటించబోయే మరో మూడు ప్రాజెక్టులు ఓకే అయ్యాయి. అందులో ఒకటి మిర్చి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో, మరొకటి త్రివిక్రమ్ దర్శకత్వంలో, మరొకటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉండనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రాన్ని గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించనున్నారు. అదే విధంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంపై కూడా మంచి అంచనాలున్నాయి. గతంలో త్రివిక్రమ్ పవన్‌తో జల్సా, బన్నీతో జులాయి చిత్రాలు తెరకెక్కించి హిట్ కొట్టడమే ఇందుకుకారణం.


Click it and Unblock the Notifications











