For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వినాయక్ చిత్రంలో రామ్ చరణ్ గెటప్ ఇదే

    By Srikanya
    |

    కోల్ కతా: ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కి సెంటమెంట్స్ ఎక్కువ అని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తూంటారు. అదే కోవలో తనకు బాగా అచ్చి వచ్చిన కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ప్రస్తుతం రామ్ చరణ్ తో షూట్ చేస్తున్నారు. మొన్న శుక్రవారం నుంచి కోలకతా లో షూటింగ్ మొదలైంది. అక్కడ ప్రస్తుతం ప్రదీప్ రావత్ తో, కొంతమంది బ్లాక్ కమెండోలతో షూట్ చేస్తున్నారు. జూలై 22 న మొదలైన ఈ షూటింగ్ లో రామ్ చరణ్ శుక్రవారం నుంచి పాల్గొంటున్నారు. అక్కడే జూలై 30 వరకూ జరుగుతుంది. ఆషిష్ విధ్యార్ది,బ్రహ్మానందం,కాజల్ పైన వచ్చే సన్నివేసాలు కూడా అక్కడ నెక్ట్స్ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. అక్కడ షూట్ చేస్తూండగా తీసిన ఫోటో ఇది.

    గతంలో వివి వినాయక్ చిత్రాలైన అదుర్స్,లక్ష్మి కూడా కోలకతా బ్యాక్ డ్రాప్ లో చేసి విజయం సాధించారు. దాంతో తనకు లక్కి ఛామ్ గా వినాయక్ ..కోలకతాని భావిస్తున్నారు. ఈ చిత్రం కూడా బాగా వర్కవుట్ అవుతుంని చెప్తున్నారు. పూర్తి కామెడీ, యాక్షన్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఫైట్స్ ని కనల్ కన్నన్ చిత్రీకరిస్తున్నారు. పైట్ కోసం కాకుండా ఈ సిటీ బ్యాక్ డ్రాప్ లో కథకు లింక్ ఉందని అందుకే ఇక్కడ షూట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. చెర్రీ అనే టైటిల్ ని ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు.

    రామ్‌చరణ్‌ ఇక మాస్‌ని ఆకట్టుకొనే కథలతోనే తెరపైకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడాయన యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మించే చిత్రంలో నటిస్తున్నారు. వి.వి.వినాయక్‌ దర్శకుడు. ఈ చిత్రంలో కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్. డి.వి.వి.దానయ్య నిర్మాత. ప్రస్తుతం కోల్‌కతాలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 21 నుంచి అక్కడ పోరాట దృశ్యాలు తెరకెక్కిస్తున్నారు.

    ఈ సినిమా కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్న..' అనే గీతాన్ని రీమిక్స్‌ చేయనున్నారు. ''మాస్‌ అంశాలకు ప్రాధాన్యం ఉన్న కథ ఇది. చరణ్‌ పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. 'ఠాగూర్‌' తరహాలో కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నాం. తమన్‌ బాణీలు హుషారుగా సాగిపోతాయ''ని ఇటీవల ఓ సందర్భంలో వినాయక్‌ చెప్పారు. సంక్రాంతికి ఈ సినిమా తెర మీదకు వస్తుంది. సమర్పణ: ఎస్‌.రాధాకృష్ణ, ఛాయాగ్రహణం: ఛోటా.కె.నాయుడు.

    English summary
    Ram Charan Teja got his first taste of shooting in Kolkata on Friday as he got drenched,flaunted a trishul and battled baddies at Chhotelal Ghat near the Mullickghat flower market for VV Vinayak's untitled film. Teja was all flared nostrils and rippling muscles as he came face-to-face with villain Pradeep Rawat and his henchmen a group of Black Cat commandos. The unit thats been shooting in Kolkata from July 22,will complete its first schedule on July 30.The second leg begins in September and Teja will be joined by Singham girl Kajal Aggarwal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X