రామ్ చరణ్ కూడా ట్విట్టర్ లో..ఎడ్రస్ ఏమిటంటే
రామ్ చరణ్ తన తాజా చిత్రం ఆరెంజ్ ప్రమోషన్ కోసమో మరెందుకో గానీ రీసెంట్ గా ట్విట్టర్ లో చేరారు. ట్విట్టర్ చేరిన కాస్సేపటికే దాదాపు పదివేల మంది ఫాలోయర్స్ చేరి ఆ రకంగానూ రికార్డ్ క్రియేట్ చేసారు. ఇక ఈ రోజు రిలీజ్ అవుతున్న ఆరెంజ్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. జెనీలియా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మించారు. రొమాంటిక్ కామిడీ గా రూపొందిన ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేసారు. అలాగే ఈ చిత్రం క్లైమాక్స్ హైలెట్ గా నిలుస్తుందంటున్నారు. ఇక మీ ప్రియమైన హీరోని ట్విట్టర్ లో కలవాలంటే...http://twitter.com/alwayscharan లో కి లాగిన్ అవ్వండి. అంతే...డైరక్ట్ గా అతనితో ఆరెంజ్ గురించే కాక మరెన్నో కబుర్లు చెప్పేయచ్చు.
రామ్ చరణ్ తేజ్ ట్విట్టర్ అల్లు శిరీష్ ఆరెంజ్ నాగబాబు ramcharan teja twitter allu sirish orange nagababu


Click it and Unblock the Notifications