twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైకిల్ ర్యాలీ: అత్తతో రామ్ చరణ్ సందడి (ఫోటోలు)

    |

    హైదరాబాద్: నిజమే! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైకిల్ ఎక్కారు. అయితే ఇదేదో రాజకీయాలకు సంబంధించిన అంశమని మాత్రం అనుకోవద్దు. రామ్ చరణ్ ఈ సంవత్సరం 'ఎర్త అవర్' కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 'పెడల్ ఫర్ ప్లానెట్' అనే కార్యక్రమాన్ని చేపట్టారు.

    'పెడల్ ఫర్ ప్లానెట్' కార్యక్రమం శనివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియం వద్ద జరిగింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగా నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీని రామ్ చరణ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తాను కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాల్సిన అవసరం ఉందని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ అత్తగారైన శోభన కామినేని కూడా పాల్గొన్నారు.

    ఈ రోజు(మార్చి 29) రాత్రి ఎర్త్ అవర్ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటలకు వరకు ఎర్త్ అవర్ పాటించనున్నారు. ఎర్త్ అవర్‌లో పాల్గొనాలనుకునే వారు గంట పాటు విద్యుత్ వాడకం నిలిపి వేయాలి.

    మనం రోజూ ఎన్నో గంటలు మన వృత్తి కోసం మన కుటుంబం కోసం వెచ్చిస్తాం. మనకు ప్రధాన జీవనాధారమైన భూమి గురించి సంవత్సరానికి ఒక గంట ఇవ్వలేమా? ఇదే ఆలోచనతో ప్రపంచ వ్యాప్తంగా మార్చి నెల చివరి శనివారం నాడు ఎర్త్ అవర్ ను పాటిస్తున్నారు. భూమి మీద వాతావరణం మెరుగుపడేందుకు, సహజమైన పరిస్ధితులు నెలకొనేందుకు ప్రజల్లో జాగృతిని తెచ్చే ఆలోచనే ఈ ఎర్త్ అవర్.

    గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమం సాగుతోందని, ప్రపంచ వ్యాప్తంగా పట్టణాలు, నగరాలు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. భూమాత అందిస్తున్న వనరులు అధిక వినియోగమవుతున్నాయని, వాటిని తగ్గించుకుని ప్రకృతి సమతౌల్యానికి పాల్పడాలన్న సందేశంతో 'ఈ ఎర్త్ అవర్' కార్యక్రమం ప్రారంభమైంది.

    కాలుష్యం పెరిగిపోవడం, ఆడవులు అంతరించిపోవడం, పర్యావరణ సమతుల్యత నశించడం వంటి కారణాల వల్ల భూమండలం వేడెక్కిపోతోంది. కాలుష్యం వల్ల ఓజోన్ పొర పలుచబడిపోతోంది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక గంట విద్యుత్ నిలిపి వేసి ఎర్త్ అవర్ పాటించడం ద్వారా పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేసిన వారమవుతామనేది ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.

    పెడల్ ఫర్ ప్లానెట్

    పెడల్ ఫర్ ప్లానెట్

    ‘పెడల్ ఫర్ ప్లానెట్' కార్యక్రమం శనివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియం వద్ద జరిగింది.

    రామ్ చరణ్

    రామ్ చరణ్

    పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగా నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీని రామ్ చరణ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తాను కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

    ఎర్త్ అవర్

    ఎర్త్ అవర్

    ఈ రోజు(మార్చి 29) రాత్రి ఎర్త్ అవర్ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని రామ్ చరణ్ పిలుపునిచ్చారు.

    రాత్రి 8.30 నుండి 9.30 వరకు

    రాత్రి 8.30 నుండి 9.30 వరకు

    రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటలకు వరకు ఎర్త్ అవర్ పాటించనున్నారు. ఎర్త్ అవర్‌లో పాల్గొనాలనుకునే వారు గంట పాటు విద్యుత్ వాడకం నిలిపి వేయాలి.

    ఎర్త్ అవర్ కాన్సెప్టు

    ఎర్త్ అవర్ కాన్సెప్టు

    మనం రోజూ ఎన్నో గంటలు మన వృత్తి కోసం మన కుటుంబం కోసం వెచ్చిస్తాం. మనకు ప్రధాన జీవనాధారమైన భూమి గురించి సంవత్సరానికి ఒక గంట ఇవ్వలేమా? ఇదే ఆలోచనతో ప్రపంచ వ్యాప్తంగా మార్చి నెల చివరి శనివారం నాడు ఎర్త్ అవర్ ను పాటిస్తున్నారు. భూమి మీద వాతావరణం మెరుగుపడేందుకు, సహజమైన పరిస్ధితులు నెలకొనేందుకు ప్రజల్లో జాగృతిని తెచ్చే ఆలోచనే ఈ ఎర్త్ అవర్.

    శోభన కామినేని

    శోభన కామినేని

    రామ్ చరణ్ తో కలిసి సైకిల్ ర్యాలీ కార్యక్రమానికి హాజరైన శోభన కామినేని.

    సైకిల్ ర్యాలీ

    సైకిల్ ర్యాలీ

    సైకిల్ ర్యాలీలో పాల్గొన్న రామ్ చరణ్. పక్కనే ఆమె అత్తగారు శోభన కామినేని.

    సైకిల్ ర్యాలీ

    సైకిల్ ర్యాలీ

    ఎకో ఫ్రెండ్లీ ఈవెంటులో భాగంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఔత్సాహికులు.

    English summary
    Ram Charan Teja flags off Eco Friendly Cycle Ride to commemorate Earth Hour Day at Gachibowli Station.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X