తండ్రి బాటను ఆనుసరిస్తున్న ‘మగధీరు’డు
"చిరుత"నయుడు, 'మగధీర' హీరో రామ్ చరణ్ హీరోగా బాబాయి నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న చిత్రం 'ఆరంజ్". ఈ చిత్రానికి భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ చిత్రం పక్కా మాస్ చిత్రమని ప్రచారాలు వస్తున్నాయి. ముందు చిరంజీవి ఒక పాత్ర చేస్తాడని వార్తలు వచ్చాయి. తర్వాత పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టుగా వర్తలు వచ్చాయి. అలాగే హీరోయిన్స్ లో కూడా ఫలానా హీరోయిన్ అంటూ రోజుకో వార్త వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఓ సామాన్య సినీ జీవిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన చిరంజీవి ఎంతటి ఘన రికార్డులను సాధించారో అదే బాటను అనుసరిస్తూ రామ్ చరణ్ ఇందులో మాస్ గా కనిపిస్తాడట తన తండ్రిలాంటి పాత్రల్ని చేసి ప్రేక్షకులకు దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తున్నాడట. దర్శకుడు కూడా తన కోరికను నెరవేర్చడానికి సహకరిస్తున్నాడని సమాచారం. ఇదిలా వుంటే తెలంగాణ కార్యకర్తలు రామ్ చరణ్ సినిమాలను అదే చిరంజీవి తాలూకా వున్న వాళ్ల సినిమాలను బ్యాన్ చేస్తామంటూ వార్తలు రావడంతో వారు పునరాలోచనలో పడ్డట్టుగా సమాచారం. అలాగే చిరంజీవి గండిపేటలో చిరు ఫిలిం స్టూడియోను నిర్మిస్తున్నాడు. తెలంగాణ వస్తే పరిస్థితులు ఏవిధంగా తన స్టూడియోకు దోహదం చేస్తాయోనని ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం స్టూడియో నిర్మాణాత్మక కార్యక్రమాలలో ఉంది.


Click it and Unblock the Notifications











