రామ్ చరణ్ సపోర్ట్ చూసుకొనే రెచ్చిపోయాడు...
స్టార్ హీరోల సపోర్ట్ వుంటే డైరెక్టర్స్ ఎంతగా అందలమెక్కేస్తారో చెప్పడానికి మన టాలీవుడ్ లో పెద్ద నిదర్శనాలే వున్నాయి. ఏదీ వాటిలో తాజాగా ఓ రెండు ఉదాహరణలు చెప్పండి అంటే ఏ మాత్రం తడుముకోకుండా చూపించిడానిక 'కొమరం పులి-ఖలేజా"సిద్దంగా వుంటాయి. కాగా పవన్ కళ్యాణ్ అండ చూసుకొని 'కొమరం పులి"కి ఎస్ జె సూర్య ఎన్ని ఎక్స్ట్ ట్రాలు చేశాడో మహేష్ బాబును ట్యూన్ చేసుకుని 'ఖలేజా"కి త్రివిక్రమ్ ఎంత ఎంజాయ్ చేశాడో రామ్ చరణ్ సపోర్ట్ తో 'ఆరెంజ్" కి భాస్కర్ కూడా అంతే రెచ్చిపోయాడని తెలుస్తోంది.
నిజానికి చరణ్ 'ఆరెంజ్" చెయ్యడం చిరంజీవికి ఇష్టం లేదనీ, భాస్కర్ చాదస్తంతో బడ్జెట్ పెరిగిపోవడం నాగబాబుకీ కష్టంగానే అనిపించిందనీ, కేవలం రామ్ చరణ్ ప్రోద్భలం వల్లే 'ఆరెంజ్"పూర్తయిందనీ ఆ యూనిట్ మెండర్సే చెబుతున్నారు. భాస్కర్ కి క్లారిటి లేకపోవడంతో 'ఆరెంజ్" కి పలుమార్లు రీ షూట్స్ చెయ్యాల్సి రావడం, అదీ ఆ రీషూట్స్ కోసం ఆస్ట్రేలియా, మలేసియాలకి మళ్ళీ మళ్ళీ పరుగులు పెట్టడం, ఈ చిత్ర నిర్మాణ వ్యయాన్ని అనూహ్యాంగా పెంచేసిందనేది నిర్మాణ వర్గాల వ్యాఖ్య.
మొత్తానికి 'మగధీర" లాంటి రేర్ ఫిల్మ్ కి ఎంత ఖర్చు పెట్టారో 'ఆరంజ్" వంటి లవ్ స్టోరికీ అంతే ఖర్చవడం ఇప్పడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. అన్నట్టు ఏమాటకా మాటే చెప్పుకోవాలంటే విజువల్ గా మాత్రం 'ఆరెంజ్" ఎక్స్ లెంట్ గా వుందట. సో..బడ్జెట్ పెరగడం వల్ల నష్టాలు చవి చూడాల్సొచ్చే ప్రమాదం నాగబాబుకే వుంది కానీ భాస్కర్ కి మాత్రం ఎలాంటి బ్యాడ్ జరగదని అంటున్నారు సినీ జనం.


Click it and Unblock the Notifications











