రామ్ చరణ్ ఓవరాక్షన్ : ఇద్దరిపై దాడి, కేసు నమోదు
బంజారాహిల్స్ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ మురళి చెప్పిన వివరాల ప్రకారం...ఆదివారం రామ్ చరణ్ షాపింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా తాజ్ కృష్ణ హోటల్ వద్ద గల ట్రాఫిక్ సిగ్నల్ వద్ద.....మారుతి ఆల్టో కారులో ఉన్న ఫనీష్, కళ్యాణ్‌లతో గొడవ పెట్టుకున్నారు. వారు రామ్ చరణ్ కారుకు సైడ్ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. దీంతో రామ్ చరణ్ సహనం కోల్పోయారు.
బాధితుల స్టేట్ మెంట్ ప్రకారం.... సిగ్నల్ పడ్డ తర్వాత తన కారును వేగంగా వారికి కారు ముందుకు తీసుకెళ్లి ఆపి, తన వెంట ఉన్న ఆరుగురు బాడీగార్డులతో ఫనీష్, కళ్యాణ్‌లపై దాడి చేయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది. అ విధంగా తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రం చేస్తున్నాడు. ఈచిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించనున్న చిత్రంలో చేయనున్నాడు.


Click it and Unblock the Notifications












