మెగాస్టార్ చిరు ‘మగధీర’కి చిరు కానుక??
అత్యధిక కలెక్షన్ల రాబట్టిన చిత్రంగా అమీర్ ఖాన్ గజినీ తర్వాత 'మగధీర" నిలిచింది. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ చేసిన పెర్ఫామెన్స్ కి ప్రేక్షకులు ఇప్పటికీ ఇంతగా ఆదరిస్తుండటంతో మెగాస్టార్ చిరంజీవి ఒక తండ్రిగా పుత్రోత్సాహంతో మురిసిపోతున్నారు. తన నటవారసుడు రామ్ చరణ్ తేజ నటించిన రెండో చిత్రం 'మగధీర" పలురికార్డులను బ్రేక్ చేసుకుంటూ విజయపథాన దూసుకుపోతుండటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు చిత్ర సీమలో ఇంతటి సంచలనం విజయం సాదింస్తున్నది కనుక ఆనందవెనుక ఉన్న కష్టానికి బహుమానంగా రామ్ చరణ్ కి విదేశీ కారును కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. రామ్ చరణ్ కు ఎంతో ఇష్టమైన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్ యువి) ను ఆయన ఇప్పటికే బుక్ చేసినట్లు తెలిసింది. మరి అంతటి గొప్ప అవకాశం ఎప్పుడా అని ఎంలో ఆత్రుతగా మగధీరుడు ఎదురుచూస్తున్నాడు.
More from Filmibeat
మగధీర రామ్ చరణ్ తేజ చిరంజీవి స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ కానుక గజిని magadheera ram charan teja chiranjeevi sports utiliti vehicle gift gajini


Click it and Unblock the Notifications











