మా మావయ్య అల్లు అరవింద్ లేకపోతే...రామ్ చరణ్
"మా మావయ్య అల్లు అరవింద్ లేకపోతే ఈ చిత్రం లేదు. ఇలాంటి చిత్రాన్ని నిర్మించడం అందరివల్లా సాధ్యం కాదు. ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా భారీ స్థాయిలో నిర్మించారు. అలాగే దర్శకుడు రాజమౌళి. పాత్రకు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేసుకొని ఎంతో కష్టపడి ఈ సినిమాను రూపొందించారు. మా కష్టానికి తగిన స్థాయిలో ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు" అన్నారు రామ్ చరణ్. చరణ్ రీసెంట్ గా హైదరాబాద్‌లో నిర్వహించిన సంతోషం అవార్డుల కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ కథానాయకుడు పురస్కారాన్ని దాసరి నారాయణరావు చేతుల మీదుగా అందుకొన్నారు. ఈ సందర్భంగా ఇలా స్పందించారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ గుర్తుంచుకొనే చిత్రం 'మగధీర'. నిర్మాత, దర్శకుడు, సాంకేతిక నిపుణులు...ఇలా ప్రతి ఒక్కరి కృషి ఫలితమే ఈ చిత్రం. ఈ సినిమాకిగాను శనివారమే చెన్నైలో ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకొన్నా. మర్నాడే హైదరాబాద్ లో సంతోషం పురస్కారం వచ్చింది. ఇలా వరసగా 'మగధీర'కు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు రామ్ చరణ్.


Click it and Unblock the Notifications











