రామ్ చరణ్,భార్యతో కలిసి హరిద్వార్ కి...
హైదరాబాద్ : రామ్‌చరణ్ పండుగను అత్తారింట్లో కాకుండా హరిద్వార్‌లో జరుపుకొంటున్నారు. 'నాయక్' విజయోత్సాహంలో ఉన్న ఆయన శుక్రవారం తన భార్య ఉపాసనతో కలిసి హరిద్వార్ ప్రయాణమై వెళ్లారు. అక్కడి ఆనంద్‌విహార్‌లో కొన్ని రోజులపాటు సేదతీరుతారు. ఆధ్యాత్మిక ఉత్తేజం కోసమే చరణ్ హరిద్వార్ వెళ్లినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. సంక్రాంతి పర్వదినాన్ని కూడా అక్కడే జరుపుకొంటారని సమాచారం. హరిద్వార్ నుంచి వచ్చాక రామ్‌చరణ్ తదుపరి చిత్రాలు 'ఎవడు', 'జంజీర్'లపై దృష్టిపెడతారు.
సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్ చిత్రం కలెక్షన్స్ బాగున్నాయి. రాంచరణ్ ద్విపాత్రాభినయం చేయగా రూపొందిన 'నాయక్' చిత్రాన్ని వివి వినాయిక్ డైరెక్ట్ చేశారు. యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించగా, యస్. రాధాకృష్ణ సమర్పించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం గురించి వినాయిక్ మాట్లాడుతూ.. "రాంచరణ్ రెండు పాత్రలూ బాగా చేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు. సినిమాలో తన బావ చనిపోయినప్పుడు అతని పర్ఫార్మెన్స్ నాకు కన్నీళ్లు తెప్పించింది'' అని చెప్పారు వి.వి. వినాయక్.
ఈ సినిమాతో నేనేమనుకున్నానో వంద శాతం దాన్ని సాధించాను. నేనూహించిన దానికి మించి ఆడవాళ్లకు కూడా బాగా నచ్చుతోంది. ఇండస్ట్రీలోని టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలుస్తుందని గట్టిగా చెప్పగలను. ట్రెమండస్ ఓపెనింగ్స్. మొదటి రోజు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. అత్యధిక థియేటర్‌లలో సినిమాని వేశారు. అందరికీ నచ్చింది. సంక్రాంతి చాలా ముందుగానే వచ్చేసిందంటున్నారు. చిరంజీవి గారికి చాలా నచ్చింది. 'చాలా బాగా తీశావ్ వినయ్. అన్నీ కుదిరాయ్. చాలా అద్భుతంగా ఉంది' అన్నారు. అలాగే ఇండస్ట్రీకి చెందినవారు చాలామంది 'సూపర్‌గా ఉంది' అన్నారు.


Click it and Unblock the Notifications











