ఆ మధ్యన రామ్ చరణ్ కి పెళ్ళి కుదిరిందంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనికి దానికీ ఏ సంభంధం లేదు. రామ్ చరణ్ తేజ తాజాగా నటిస్తున్న రాజమౌళి చిత్రంలో ఈ పెళ్ళిపీటల విశేషం చోటు చేసుకుంది. ఈ సన్నివేశం నిన్న(గురువారం) ఫిల్మ్ నగర్ ధైవ సన్నిధానంలో షూట్ చేసారు. కథ ప్రకారం రామ్ చరణ్ పెళ్ళి కొడుకు గెటప్ లో వచ్చి తన స్నేహితుడు కూర్చొవాల్సిన పీటలపై కూర్చుంటాడు. దాంతో గొడవ జరిగి పెళ్ళి ఆగిపోతుంది. అలా ఎందుకు చేస్తాడంటే ఆ ఫ్రెండ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ తప్పని స్దితిలో పెళ్ళి వేరే వాళ్ళని చేసుకోవాల్సి వస్తుంది. దాంతో అది తప్పించటానికే ఈ పెళ్ళి కొడుకు వేషం కట్టాడని అంటున్నారు. ఇక షూటింగ్ అని తెల్సినా సరే పెళ్ళికొడుకు గెటప్ లో రామ్ చరణ్ రావటం మాత్రం రావటం అక్కడ మూగిన అందరిని ఒక్క క్షణం పాటు షాక్ చేసింది.ఇదే టాపిక్ నిన్నంతా ఫిల్మ్ సర్కిల్స్ లో నలిగింది.