రచ్చ షూటింగ్‌లో గాయపడ్డా రామ్ చరణ్ తేజ
హీరో రామ్ చరణ్ తేజ మంగళవారం ఘోర ప్రమాదం నుండి తృటిలో బయటపడ్డారు. రచ్చ సినిమా షూటింగ్‌లో భాగంగా చరణ్ సమయంలో ఓ కారులో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పగాయాలతో బయట పడ్డాడు. రచ్చ ఓపెనింగ్ ఎపిసోడ్ సీన్ కోసం ఓ ట్రైన్ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చెర్రీ ఓ కారుపై వెళుతుండగా కింద పడ్డాడు. ఆయనతో పాటు కారులో ఎవరూ లేరు. ఇది ఓపెనింగ్ సీన్ కావడంతో భారీగా చిత్రీకరించాలని భావిస్తున్నారు. హీరో చెర్రీ సైతం రిస్క్ తీసుకొని దీనిని చేయడానికి సిద్ధపడ్డాడు.
ప్రమాజం జరిగిన తర్వాత చెర్రీ రైల్వే ట్రాక్ పైనే కుర్చీ వేసుకొని విశ్రాంతి తీసుకున్నాడు. గాయాలు స్వల్పంగా ఉండటంతో ఒకటి రెండు గంటలు విశ్రాంతి తీసుకొని మళ్లీ షూటింగులో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య హీరోలు రిస్క్ తీసుకొని నటిస్తుండటంతో తరుచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల మంచు మనోజ్ కుమార్ కూడా ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు.


Click it and Unblock the Notifications











