రామ్ చరణ్ ఇంటర్వూ ('వన్ ఇండియా' ప్రత్యేకం)

By Srikanya

హైదరాబాద్: రామ్‌చరణ్ హీరో గా నటించిన చిత్రం 'తుఫాన్'. అపూర్వ లాఖియా దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఎ సర్టిఫికెట్‌ను పొందింది. ఈ నెల 6న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఆయన 'వన్ ఇండియా' తో ప్రత్యేకంగా మాట్లాడారు.

రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమీత్ ప్రకాష్ మెహ్రా, ఫ్లైయింగ్ టర్టిల్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. "హై ఓల్టేజ్ డ్రామా మిళితమైన కథ ఇది. పాటలకు మంచి స్పందన వస్తోంది''అని నిర్మాతలు చెప్పారు. ప్రకాష్‌రాజ్, శ్రీహరి, తనికెళ్ల భరణి, మహిగిల్ కీలక పాత్రధారులు.

ఇంటర్వూలో రామ్ చరణ్ ఏమన్నారంటే..స్లైడ్ షోలో..

 తెలంగాణ ఏర్పాటుపై...

తెలంగాణ ఏర్పాటుపై...

హీరో రామ్ చరణ్ ఎట్టకేలకు రాష్ట్ర విభజనపై ప్రతిస్పందించారు. తెలంగాణ ఏర్పాటుపై ఆయన నోరు విప్పారు. సినిమాలను, రాజకీయాలను కలిపి చూడవద్దని ఆయన విజ్ఝప్తి చేశారు. సినిమా విడుదలకు తేదీ దగ్గరపడుతుండడంతో రాష్ట్ర విభజనపై ఆయన గొంతు విప్పాల్సిన పరిస్థితిలో పడ్డారని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం తన చిత్రం కన్నా గొప్పదని ఆయన వ్యాఖ్యానించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ రకంగా ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా వైఖరి తీసుకున్నట్లు చెబుతున్నారు.

రూమర్స్ అంటూ...

రూమర్స్ అంటూ...

కొన్ని ప్రాంతాలలో రిలీజ్ అవ్వదంటూ వస్తున్న వార్తలను రామ్ చరణ్ కొట్టిపారేసారు. ఆయన మాట్లాడుతూ... " కొంత సమస్య. ఉన్నా మిగతా చోట్ల .. అంతా బాగానే ఉంది. త్వరలోనే అంతా సర్దుకుంటుందని భావిస్తున్నాను. నా సినిమా రిలీజ్ పై అవి ప్రబావం చూపిస్తాయ ని భావించను.. ."

స్పెషల్ షో వేసాం...

స్పెషల్ షో వేసాం...

" ఈ మధ్యనే స్పెషల్ స్క్రీనింగ్ వేసాం. మా డైరక్టర్ ఓ పెన్, పేపరు పట్టుకుని రీ ఎడిటింగ్ కోసం కూర్చున్నారు. కానీ మా నాన్నగారు అంతా బాగుందని మెచ్చుకున్నారు. అంతా ఫెరఫెక్ట్ అని చెప్పారు. అది మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది. ఇది నా జీవితంలో చాలా మెమరిబుల్ మూమెంట్ ," అని రామ్ చరణ్ అన్నారు.

తేడా తెలియదు

తేడా తెలియదు

నేను మొదటి నుంచి ఓ నటుడు కొడుకుగానే గుర్తుంపు పొందుతూ వచ్చాను కాబట్టి. నటుడి కుమారుడు గా కొత్తగా నేనేంటనే తేడా నాకు తెలియదు. అది మంచో ,చెడో నాకు తెలియదు అని అన్నారు.

సాధారణంగా పెరిగాను..

సాధారణంగా పెరిగాను..

"నేను ఓ నార్మల్ కిడ్ గానే పెరిగాను... మా నాన్నగారు మమ్మల్ని సినిమాలనుంచి దూరంగా ఉంచారు. ..మా ఇంట్లోకి సినిమా మ్యాగజైన్స్ కూడా రానిచ్చేవారు కాదు. సినిమాలు కూడా చూసే వాళ్లం కాదు. "

సెట్స్ మీదకు వెళ్లే వాడిని కాదు...

సెట్స్ మీదకు వెళ్లే వాడిని కాదు...

" నేను చాలా అరుదుగా మా నాన్నగారి సెట్స్ కు షూటింగ్స్ కు వెళ్ళే వాడిని. చాలా సార్లు తీసిన షాటే తీయటం చాలా బోర్ గా ఉండేది. అప్పుడు నాకు ఏం చేయటానికి ఏముంది. నేను అప్పుడు కమెరామెన్ ని ఇరిటేట్ చేసేవాడిని. హీరోయిన్స్ కూడా చాలా పెద్దవారు నాతో మాట్లాడటానికి కుదురేది కాదు. ఫిల్మ్ సెట్స్ మీద నేను చాలా బోర్ ఫీలయ్యేవాడిని ."

చిన్న వయస్సులోనే...

చిన్న వయస్సులోనే...

తాను 18 సంవత్సరాలకే నటుడు అవటం గురించి చెప్తూ... "నా గుమ్మం దగ్గర అవకాసం ఉందని రియలైజ్ అయ్యాను. .. దాన్ని నెక్ట్స్ లెవిల్ కి తీసుకు వెళ్లాలని ఆశించాను ," అని రామ్ చరణ్ అన్నారు.

ఎడ్వాంటేజ్..డిజఎడ్వాంటేజ్ లు..

ఎడ్వాంటేజ్..డిజఎడ్వాంటేజ్ లు..

మెగా స్టార్ అవటం కొంత మంచి దాని దానికుండే దానికి ఉంటాయంటున్నాడు. రామ్ చరణ్ చెప్తూ... " నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం..కానీ బయిటకు వెల్లలేను. రెస్టారెంట్స్ కు మా ప్రెండ్స్ తో వెళ్లాలని ఉంటుంది కానీ కుదురదు. కొంచెం కూడా ప్రెవేట్ లైఫ్ ఉండదు. రెస్పాన్సిబులిటీ పెరిగే కొలిదీ .. మీడియా వైపు ప్రెజర్ ఉంటుంది. ."

డిజ్ ఎడ్వాంటేజే లే ..ఎడ్వాంటేజ్ లుగా..

డిజ్ ఎడ్వాంటేజే లే ..ఎడ్వాంటేజ్ లుగా..

రామ్ చరణ్ మాట్లాడుతూ... "అయితే ఎలాంటి సమస్యలు,ప్లాబ్లంలు ఉన్నా నేను చాలా పాజిటివ్ గా ఉంటాను. అప్పుడు మైనస్ లు అన్నీ ప్లస్ లుగా మారిపోతాయి. పరిస్ధితిని బట్టి ఎడాప్ట్ అయిపోతూంటాను... ."

అలా సెలెక్ట్ అయ్యా...

అలా సెలెక్ట్ అయ్యా...

‘జంజీర్' కథ రెడీ అయ్యాక హీరో కోసం అన్వేషిస్తున్న టైంలో అనుకోకుండా అపూర్వ లఖియా నా ‘మగధీర' సినిమా చూసారు. ఆ మూవీలోనా యాక్షన్ సీక్వెన్స్ చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే జంజీర్ కి రామ్ చరణ్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యానని' రామ్ చరణ్ సమాధానం ఇచ్చాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీ హరి షేర్ ఖాన్ పాత్రలో కనిపించనున్నాడు. తుఫాన్ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ - పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమీత్ ప్రకాష్ మెహ్రా - ఫ్లైయింగ్ టర్టల్ ఫిల్మ్స్ వారు కలిసి నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X