ఆయన డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్..
ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద దర్శకుల పేర్లు తర్వాత వినిపిస్తున్న పేరు వంశీ పైడిపల్లి. తన మొట్టమొదటి సినిమా మున్నా సినిమా ద్వారా వెండి తెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు వంశీ పైడిపల్లి. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ తనకంటూ ఓవైవిద్యమైన దర్శకుడంటూ ముందుకోచ్చాడు. ఇంతకీ వంశీ పైడిపల్లిని అందరూ మెచ్చుకోవడానికి కారణం మాస్ హీరో అయినటువంటి జూఎన్టీఆర్ చేత బృందావనం లాంటి క్లాస్ సినిమా తీసి అందరి చేత శభాష్ అని అనిపించుకున్నాడు. అసలు జూఎన్టీఆర్ నిఆక్యారెక్టర్ కోసం ఒప్పించడమే పెద్ద సాహాసం అని చెప్పాలి. అలాంటిది అంత పెద్ద హిట్ సినిమా తీసి జూఎన్టీఆర్ క్లాస్ సినిమాలు చేయలేరు అనే వాళ్శ నోరు మూయించాడు మన వంశీ పైడిపల్లి.
బృందావనం సినిమాతో దర్శకునిగా నిరూపించుకున్న వంశీ పైడిపల్లికి మరో అరుదైన అవకాశం లభించింది. రామ్ చరణ్ వంశీ దర్శకత్వంలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొంత కాలంగా రామ్ చరణ్ తేజ్ డేట్స్ గురుంచి ఎదురుచూస్తున్న దిల్ రాజు నిరీక్షణ ఫలించింది. దిల్ రాజు, చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో జూలై నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. గతంలో కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఎదురు చూస్తూ సరైన కధ దొరక్క సినిమా చేయలేకపోయారు రాజు. అప్పుడు ఎన్టీఆర్ ని తన కధతో ఒప్పించి దిల్ రాజు బేనర్ లో సినిమా చేసాడు. ఇప్పుడు కూడా గత కొంత కాలంగా చరణ్ తో సినిమా చేయాలని అనుకుంటున్న రాజు కోరికను మరోసారి వంశీ పైడిపల్లి తీర్చబోతున్నాడు. ఏదైతేనేం మన యువ దర్శకుడు వంశీ పైడిపల్లి తీసేటటువంటి ఈసినిమాకుడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











