మా అబ్బాయి కన్నా రామ్ చరణ్ తేజ బెస్ట్
రామ్ చరణ్ తేజ సూపర్ హిట్ మగధీర చిత్రంతో మంచి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి అతను ఖైధీ రీమేక్ చేస్తే బావుంటుంది అంటూ మనస్సులో మాట చెప్పుకొచ్చారు..దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి. ఆయన వైభవ్ తాజా చిత్రం కాస్కో ప్రమోషన్ లో భాగంగా ఓ టీవి చానెల్ తో మాట్లాడుతూ..తన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ ని రీమేక్ చేస్తే ఈ రోజుకీ బాగా ఆడుతుందని అన్నారు. అయితే మీ అభ్బాయి వైభవ్ తో చేయవచ్చుగా అంటే..కాదని మా అబ్బాయి కన్నా రామ్ చరణ్ తేజ బెటర్ అనీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్లో దాదాపు ఇరవై ఐదు వరకూ చిత్రాలు రూపొందాయి. అందులో 23 వరకూ మంచి హిట్ అయ్యాయనే సంగతి తెలిసిందే. ఆ చిత్రాల్లో ఖైదీ ది ప్రత్యేక స్ధానం. చిరంజీవి, కోదండరామి రెడ్డి, పరుచూరి బ్రదర్స్ కి ఆ చిత్రం కొత్త స్టార్ డమ్ ని ఇచ్చి నిలబెట్టింది.
వైభవ్ రామ్ చరణ్ తేజ్ చిరంజీవి మగధీర రాజమౌళి కాజల్ కాస్కో శ్వేతాబసు ఎ కోదండ రామిరెడ్డి vhibhav ram charan teja chiranjeevi magadheera rajamouli kasko swetha basu kondanda rami reddy


Click it and Unblock the Notifications