చిరంజీవి అత్తగా వాణిశ్రీ మరి రామ్ చరణ్ తేజ్ అత్తగా ఎవరు..?

By Nageswara Rao

మోగాస్టార్ తనయుడు గా రంగ ప్రవేశం చేసినటువంటి రామ్ చరణ్ తేజ్ మగధీర విజయంతో అనతికాలంలోనే అగ్రకధానాయకుడు గా టాప్ లిస్ట్ లో చేరిపోయాడు. మెగాపవర్ స్టార్ భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు ఖైదీ, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సినిమాలు రామ్ చరణ్ తో రీమేక్ చేయబోతున్నారన్న వార్తలు అనధికారంగా బయటకు వచ్చాయి. ఐతే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ జీవితంలో బిగ్గేస్టే హిట్ అయినటువంటి సినిమా అత్తకుయముడు అమ్మాయికి మొగుడు. ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చేయబోతున్నారని తాజా సమాచారం. ఇందులో చిరంజీవికి అత్తగా వాణిశ్రీ నటించగా, కూతురుగా విజయశాంతి నటించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ కొత్తగా చేయబోయే సినిమాలో రామ్ చరణ్ కి అత్తగా అతిలోకసుందరి శ్రీదేవి అత్తగా నటించగా, కూతురుగా శ్రీదేవి కూతురు జాహ్నవి ని తెలుగు తెరకు పరిచయం చేస్తారని వినికిడి. ఐతే ఈ సినిమాని అధికారకంగా ప్రకటించాల్సి ఉందని ఫిలిమ్ నగర్ వర్గాల భోగట్టా..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X