మరో ‘మగధీర’ - మెగా ‘మెరుపు’లు మొదలైయ్యాయి!
బాక్సాఫీస్ వద్ద మరపురాని విజయం సాధించిన 'మగధీర" కాంబినేషన్ తమ స్ర్కీన్ కెమిస్ట్రీతో మరోసారి సంచలనం సృష్టించేందుకు సన్నద్దమవుతోంది. రామ్ చరణ్ కాజల్ ల సూపర్ హిట్ ఫెయిర్ తో ధరణి దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్ పై రూపొందనున్న భారీ చిత్రం ఈ రోజు(ఏప్రిల్ 30)న హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైనది. ఈ ప్రారంభోత్సవానికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు విచ్చేశారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్-కాజల్ ల కొత్త సినిమా ఓపెనింగ్ మెగా 'మెరుపు" లతో సందడిగా జరిగింది. మగధీర ఫెయిర్ చెర్రీ-కాజల్ ల ఈ యాక్షన్ లవ్ స్టోరీ వాళ్ళిద్దరి కలయికకూ మరో 'మగధీర" కావలని 'బంగారం" ఫేం ధరణి దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ పై తెరకెక్కనున్న భారీ యాక్షన్ లవ్ స్టోరీ కి'మెరుపు" చిత్రం మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో ఆరంభమైంది.
రామానాయుడు కెమరా స్విఛాన్ చేయగా శ్రీను వైట్ల ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. తమ కలయికను ముద్రించాలని ముచ్చటపడుతోన్న పలు కెమెరాల మెరుపుల మధ్య తనయుడిని హత్తుకొని ఆల్ ది బెస్ట్ చెప్పారు చిరు. డ్యాన్స్ లో, ఫైట్స్ లో మెరుపు వేగం చూపిస్తోన్న రామ్ చరణ్ కి 'మెరుపు" అనే టైటిల్ పెట్టడం పట్ల విశేష స్పందన లభిస్తోంది. టైటిల్ కి తగ్గట్టే స్పీడ్ స్పీడ్ గా షూటింగ్ జరుపుకోనున్న ఈ 'మెరుపు" కి మ్యూజిక్ దేవిశ్రీప్రసాద్ అందిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











