కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చిరు’ కాదు ‘ఆరెంజ్’ బోయ్ రామ్ చరణ్ !?
'మగధీర' చిత్రంతో టాలీవుడ్ ను షేక్ చేసిన రామ్ చరణ్ ప్రస్తుతం ఆరెంజ్, మెరుపు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాల షూటింగ్ ముగిసిన అనంతరం కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లు టాలీవుడ్ లేటెస్ట్ టాక్. విశ్వసనీయ సమాచారం ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి కృష్ణవంశీతో స్వయంగా రామ్ చరణ్ తదుపరి చిత్రంపై కృష్ణవంశీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టును తయారు చేయాల్సిందిగా కృష్ణవంశీని చిరంజీవి కోరినట్లు సమాచారం.
కాగా ఈ చిత్రాన్ని పీఆర్పీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిర్మించనున్నట్లు భోగట్టా. అన్నీ అనుకున్నట్లు జరిగితే చిత్రం షూటింగ్ వచ్చే అక్టోబరు నెల నుంచి ప్రారంభమవుతుంది.
రామ్ చరణ్ తేజ్ చిరంజీవి కృష్ణవంశీ గంటా శ్రీనివాస రావు మగధీర ఆరంజ్ మెరుపు ram charan teja chiranjeevi krishna vamsi ganta srinivasa rao magadheera orange merupu


Click it and Unblock the Notifications