రామ్ చరణ్ చిత్రం రిలీజ్ డేట్

ఇక ఈ చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ...ఈ చిత్ర కథ లవ్ స్టోరీ అని, అలాగే.. యాక్షన్ భరితంగా వుటుందన్నారు. అయితే.. యాక్షన్ ఫీలింగ్ ఎక్కడా కనిపించదని దర్శకుడు రాజమౌళి చెప్పారు. 400 ఏళ్ల నాటి కథ. కొత్త కధనంతో తెరకక్కిస్తున్నాం. రెండు జన్మల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఇందులో చూపిస్తాం. అయితే జన్మల విషయం ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో జరిపాం.
ఇమేజ్ చట్రంలో బంధించవద్దని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చాలా గ్యాప్ తర్వాత రెండో చిత్రం చేస్తున్నాను. కరాటే, హార్స్ రైడింగ్‌లలో శిక్షణ పొందాను . అవి ఈ చిత్రం కథ పరంగా ఉపయోగపడతాయి. కథలోని సన్నివేశాలకు అనుగుణంగా దేహదారుఢ్యాన్ని మార్చేందుకు బాగా శ్రమించాల్సి వచ్చింది. అదేసమయంలో చిత్రపరిశ్రమలో ఇపుడే అడుగుపెట్టాను. ప్రత్యేకమైన ఒక ఇమేజ్ చట్రంలో బంధించవద్దని రామ్ చరణ్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి ఎంఎంకీరవాణి సంగీత బాణీలను సమకూర్చుతున్నారు. ఎం.రత్నం మాటలు రాయగా, బీవీఎస్ఎన్ ప్రసాద్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











