twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ చిత్రం రిలీజ్ డేట్

    By Staff
    |

    Ram Charan Teja
    రామ్ చరణ్ తేజ, కాజల్ కాంబినేషన్లో ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న మగధీర చిత్రం ఏప్రియల్ తొమ్మిదిన రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే ఈ చిత్రం ఆడియోని మార్చి ఇరవైన విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. సుప్రీమ్ ఆడియోవారు విడుదల చేసే ఈ చిత్ర సంగీతాన్ని ఎమ్.ఎమ్.కీరవాణి అందించారు. ఇక గీతా ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై మార్కెట్లో పలు అంచనాలు ఉన్నాయి.

    ఇక ఈ చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ...ఈ చిత్ర కథ లవ్ స్టోరీ అని, అలాగే.. యాక్షన్ భరితంగా వుటుందన్నారు. అయితే.. యాక్షన్ ఫీలింగ్ ఎక్కడా కనిపించదని దర్శకుడు రాజమౌళి చెప్పారు. 400 ఏళ్ల నాటి కథ. కొత్త కధనంతో తెరకక్కిస్తున్నాం. రెండు జన్మల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఇందులో చూపిస్తాం. అయితే జన్మల విషయం ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో జరిపాం.

    ఇమేజ్ చట్రంలో బంధించవద్దని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చాలా గ్యాప్ తర్వాత రెండో చిత్రం చేస్తున్నాను. కరాటే, హార్స్ రైడింగ్‌లలో శిక్షణ పొందాను . అవి ఈ చిత్రం కథ పరంగా ఉపయోగపడతాయి. కథలోని సన్నివేశాలకు అనుగుణంగా దేహదారుఢ్యాన్ని మార్చేందుకు బాగా శ్రమించాల్సి వచ్చింది. అదేసమయంలో చిత్రపరిశ్రమలో ఇపుడే అడుగుపెట్టాను. ప్రత్యేకమైన ఒక ఇమేజ్ చట్రంలో బంధించవద్దని రామ్ చరణ్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి ఎంఎంకీరవాణి సంగీత బాణీలను సమకూర్చుతున్నారు. ఎం.రత్నం మాటలు రాయగా, బీవీఎస్ఎన్ ప్రసాద్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X