రామ్ చరణ్ తేజా కొత్త చిత్రం షురూ
మగధీర చిత్ర విజయం హుషారులో ఉన్న రామ్ చరణ్ తేజా మూడో చిత్రం బుధవారం హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ ప్రారంభమైంది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించే ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రామచరణ్ తేజా సరసన జెనీలియా కథానాయికగా నటిస్తోంది. చిత్ర నిర్మాతగా చిరంజీవి సోదరుడు నాగబాబు వ్యవహరిస్తున్నారు.
చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో పాటు అల్లు అరవింద్, దాసరి నారాయణరావు, డి.రామానాయుడు, రాఘవేంద్ర రావు, శ్రీకాంత్, అలీ తదితరులు హాజరయ్యారు. తాను కుటుంబ సభ్యుల్లో ఎక్కువ సమయం నాగబాబుతో గడుపుతానని రామ్ చరణ్ తేజా ఈ సందర్భంగా అన్నారు. రామ్ చరణ్ తేజా తొలి చిత్రం చిరుత. ఆ తర్వాత మగధీర సూపర్ హిట్టయింది.
More from Filmibeat
రామ్ చరణ్ తేజ జెనీలియా బొమ్మరిల్లు భాస్కర్ అంజనా ప్రొక్షన్స్ కొత్త చిత్రం ప్రారంభం ram charan teja third film launched bommarillu bhaskar anjana productions


Click it and Unblock the Notifications











