మళ్ళీ హిట్ కొడితే తప్ప రామ్ చరణ్ ఆపని చేయలేడట...!?
'ఆరెంజ్ దెబ్బతో" చరణ్ కి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఏ సినిమా చేయాలో తెలియక, ఆల్రెడీ ఒప్పుకున్న'మెరుపు" సినిమా అటకెక్కిపోవడంతో చాలా తికమకపడ్తున్నాడు చరణ్. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న'రచ్చ" సినిమా ఎప్పుడు సెట్టస్ మీదకు వెళ్తుందనే టెన్షన్ చరణ్ కి ఇంకా తగ్గలేదు. ఈ టెన్షన్ ల మధ్య బ్రాండ్ అంబాసిడర్ గా వస్తోన్న అవకాశఆలకు న్యాయం చేయలేనన్న కోణంలో చరణ్, అలా వస్తున్న అవకాశాలన్నింటినీ వదిలేసుకుంటున్నాడు.
ఆ మధ్య ఎయిర్ టెల్ కి, పెప్సీ సంస్థకీ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిన చరణ్, ఇప్పట్లో బ్రాండ్ అంబాసిడర్ గా ఏ బ్రాండ్ కీ పనిచేయకూడదని డిసైడ్ అయ్యాడట. మళ్ళీ హిట్టు కొడితే తప్పు, కమర్షియల్ యాడ్స్ రంగంలోకి దిగకూడదని చరణ్ అనుకుంటోంటే, మహేష్, ఎన్టీఆర్ కమర్షియల్ యాడ్స్ రంగంలో దూసుకుపోతున్న దరిమిలా, చరణ్ పై అభిమానుల నుంచి ఒత్తిడి రోజురోజుకీ పెరుగుతోంది.
త్వరగా సినిమా చేసేసి, ఆ తర్వాత కమర్షియల్ యాడ్స్ కి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తోంటే, అనుకున్న ఏ ప్రాజెక్టూ సెట్స్ మీదకు సకాలంలో వెళ్ళకపోవడం చరణ్ ని మరింత కుదేలయ్యేలా చేస్తోంది. అంతా 'మగధీర" ఎఫెక్టు మరి..హిట్టు రావడం కాదు..ఆ తర్వాత నిలదొక్కుకోవడం కష్టమని ఊరకనే అన్నారా.


Click it and Unblock the Notifications











