చిరంజీవి ఇమేజ్‌ అంతవరకే...రామ్ చరణ్ తేజ్

By Srikanya

మెగాస్టార్‌ తనయుడుగా తనకు చిరంజీవి ఇమేజ్‌...ఒక వాహనం ఇంజన్‌ను స్టార్ట్‌ చేయడంలా మాత్రమే ఉపయోగపడుతుందని, ఆ తర్వాత గేర్లు మార్చుకుంటూ ఆ వెహికిల్‌ను నడిపవలసింది తనేనని రామ్ చరణ్‌ తేజ్ అంటున్నారు. ఈ విషయాన్ని ఆరెంజ్ చిత్రం షూటింగ్ ‌కోసం ఆస్ట్రేలియాలో ఉన్న రామ్ ‌చరణ్‌ తేజ్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. అలాగే 'మగధీర' హిందీ రీమేక్‌ లో తనని హీరో పాత్ర ఆఫర్‌ చేశారని..అయితే తాను నిరాకరించానని చెప్తున్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ...'గజిని' నిర్మించిన బేనరులో నన్ను హిందీలో చేయమని అడిగారు. కానీ నాకు ఇష్టంలేదు. ఒకసారి చేసిన క్యారెక్టరును మళ్లీ ఎందుకు చేయడం? పైగా దర్శకుడు మారినప్పుడు తెలుగు మగధీరకు మార్పులు తప్పకుండా జరుగుతాయి. అన్నిటికన్నా మంచి నాకు తెలుగులో మంచి పొజిషన్‌ ఇచ్చారు ప్రేక్షకులు. హిందీ చిత్రాలకు తగ్గని దారిలో మగధీరను పెద్దహిట్‌ చేశారు. తెలుగులో ఇప్పటికి నేను చేసినవి రెండు చిత్రాలు మాత్రమే. మూడవది ఇప్పుడు బాస్కర్‌ దర్శకత్వంలో చేస్తున్నాను. హిందీలో సినిమాలు చేయడానికి ఎటువంటి తొందర లేదు. నిజంగా నేను చేస్తే బావుంటుంది అని ఫీలయిన కథ వచ్చినపుడు అప్పుడు హిందీ సినిమా గురించి ఆలోచిస్తాను' అన్నారు. అలాగే తన ఆలోచనలకు దగిన అమ్మాయి దొరికిన తర్వాత ఓ ఇంటివాడ్ని అవుతానని చరణ్‌ మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X