రామ్ చరణ్ తేజ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

By Srikanya

"వైవిధ్యమైన పాత్రల్లో నటించాలన్నది నా తపన. మగధీర తరవాత భాస్కర్‌ చెప్పిన ఈ కథ ఎంతో నచ్చింది" అంటున్నారు రామ్‌ చరణ్‌. ఆయన తదుపరి చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి(శుక్రవారం)ముంబయిలో మొదలవుతుంది. మూడు వారాలపాటు అక్కడే ముఖ్య సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. జనవరిలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రాంతంలో చిత్రీకరణ ఉంటుంది. అలాగే ఈ చిత్రం షూటింగ్‌ ఆహ్లాదకరమైన కథ, కథనాలతో ఉంటుందని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ చెప్పారు. అంజనా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జెనీలియా హీరోయిన్. ఆరెంజ్ అనేది వర్కింగ్ టైటిల్. ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా సుజాని అనే మోడల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం రిలీజుకు రెడీగా ఉన్న ఓ హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే ఆమె చాలా యాడ్ ఫిలిమ్స్ లో కనిపించింది. అలాగే ప్రయాణం చిత్రంలో హీరోయిన్ ప్రెండ్ గా చేసిన ఆమెను కూడా మరో కీలకమైన పాత్రకు తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నాగబాబు నిర్మాత, సంగీతం: హారిస్‌ జైరాజ్‌, కెమెరా: కిరణ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: మన్యం రమేష్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X