రామ్ చరణ్ 'ఆరెంజ్' తాజా సమాచారం
రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఆరెంజ్'..ఆ రేంజే వేరు చిత్రం నవంబర్ 10న దీపావళి రోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఆడియో ఫంక్షన్ ని అక్టోబర్ 10న విడుదల చేయాలని నిర్మాత నిర్ణయించారు. ఇక రెండు నెలలపాటు ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుని ఇండియా వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో పాట చిత్రీకరణ జరుగుతోంది. ఇదే ఆఖరి పాట అనీ దాంతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్లేనని చెప్తున్నారు.
ఇక జెనీలియా హీరోయన్ గా చేస్తోంది. ఆమెతో పాటు షాజన్ పదమ్ సీ, సంచితా షెట్టి లీడ్ రోల్స్ చేస్తున్నారు. షాజన్ పదమ్ సీ ఈ చిత్రంలో టీనేజ్ అమ్మాయిగా, ఫ్రెష్‌గా కనిపిస్తాను అని చెప్తోంది. సినిమా సెకెండాఫ్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఆమె పాత్ర వస్తుంది. నాగేంద్రబాబు తన అంజనా ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కె.వెంకట్రావు సమర్పించే ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. అలాగే ఈ ఈచిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. మరో ప్రక్క రామ్ చరణ్ ధరణి దర్శకత్వంలో 'మెరుపు' అనే చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











