రామ్ చరణ్ ‘ఆరెంజ్’ రిలీజ్ డేట్ కన్ ఫామ్...
రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'ఆరెంజ్". అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాలోని సెకెండాఫ్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో సెకెండ్ హీరోయిన్ గా షాజన్ పదమ్ సీ కనిపించనుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 12న రిలీజ్ చేస్తున్నట్లు నాగబాబు తెలిపారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం పాటలు ఆడియో రంగంలో రికార్డ్‌ను సృష్టిస్తోంది. 'మగధీర" లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం 'ఆరెంజ్" కావటంతో అన్ని చోట్లనుంచి మంచి బిజెనెస్ రెస్పాన్‌స వస్తున్నట్లు సమాచారం.
రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ జెనీలియా బొమ్మరిల్లు భాస్కర్ నాగబాబు ram charan teja orange genelia bommarillu bhaskar nagababu


Click it and Unblock the Notifications