ఆరెంజ్ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ పాత్ర ఏంటంటే...
రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం ఆరెంజ్ లో గ్రాఫిటీ ఆర్టిస్టు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రను ప్రత్యేకంగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ డిజైన్ చేసినట్లు చెప్తున్నారు. అలాగే షూటింగ్ కు ముందు రామ్ చరణ్ తేజ్ కొద్ది మంది గ్రాఫిటీ ఆర్టిస్టులతో ఇంట్రాక్ట్ అయ్యి మరీ చేస్తున్నాడని తెలుస్తోంది. అంజనా ప్రొడక్షన్స్ నిర్నించే ఈ చిత్రంలో హీరోయిన్ గా జెనీలియా చేస్తోంది. ఈ నెలాఖరుకు వరకూ ఈ చిత్రం షూటింగ్ మెలబోర్న్ లో జరుగుతుంది. అలాగే సెకెండ్ హీరోయిన్ గా చేస్తున్న షాజాన్ పద్మాసి కి జెనీలియాకు పదిహేను నిముషాలు పాటు జరిగే సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓ రేంజ్ లవ్ స్టోరీ (Orange love story) అనే ట్యాగ్ లైన్ పెట్టారు.
రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ జెనీలియా బొమ్మరిల్లు భాస్కర్ నాగబాబు ram charan teja orange genelia bommarillu bhaskar nagababu parugu


Click it and Unblock the Notifications