చెర్రీని మెప్పించలేక పోయిన ప్రభుదేవా!
కొరియో గ్రాఫర్ నుంచి దర్శకుడిగా టర్న్ అయిన ప్రభుదేవా ప్రస్తుతం పలు చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ అన్ని భాషల్లోనూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రభుదేవా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి. రామ్ చరణ్ కోసం ఒక కథను సిద్ధం చుసుకున్న ప్రభుదేవా ఇటీవల కొన్ని రోజుల క్రితం చెర్రీని కలిసి కథ వినిపించాడని, అయితే ప్రభుదేవా చెప్పిన స్టోరీ రామ్ చరణ్‌ను మెప్పించలేక పోయిందని ప్రచారం జరుగుతోంది. దీంతో కథలో మరికొన్ని మార్పులు చేసేందుకు ప్రభుదేవా నిర్ణయించాడని అంటున్నారు. మరి ఈ సారైనా ప్రభుదేవా చెర్రీని మెప్పిస్తాడో? లేదో? అని చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో నటించనున్నాడు. వీటితో పాటు వివి వినాయక్ దర్శకత్వంలోనూ డబల్ రోల్ లో నటించనున్నాడు.
ప్రబుదేవా ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా 'రౌడీ రాథోడ్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ-రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన విక్కమార్కుడు సినిమాకు ఇది రీమేక్. రౌడీ రాథోడ్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తో చేసే సినిమాపై ప్రభుదేవా దృష్టి పెట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











