ఇద్దరికీ గుండె ఆగినంత పనైంది: రామ్‌చరణ్‌

By Srikanya

హైదరాబాద్ : రామ్‌చరణ్‌, రానా... ఇద్దరూ చిన్నప్పట్నుంచీ స్నేహితులనే విషయం మనకు తెలిసిందే. స్కూల్‌డేస్‌లో ఎన్నో అల్లరి పనులు చేశారు. అలాంటి ఓ సంఘటనని చెర్రీ ఇలా గుర్తు చేసుకున్నాడు. తను చిన్నప్పుడు భయపడిన విషయాన్ని తలుచుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుందని చెప్తున్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ... నానక్‌రామ్‌గూడాలో మాయా గుహలు ఉన్నాయని ఎవరో చెబితే నేనూ రానా ఓరోజు రాత్రి ఇంట్లో చెప్పకుండా అక్కడికి వెళ్లాం. అక్కడున్న కొండ ఎక్కి చూస్తే... పుర్రెలూ నల్లని బొమ్మలూ దూరంగా మంటలూ కనిపించాయి. అంతే, ఇద్దరికీ గుండె ఆగినంత పనైంది.

చాలా భయమేసింది. వెనక్కి తిరిగి పరుగు అందుకున్నాం. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకూ పరుగు ఆపలేదు. ఆ సంఘటన తల్చుకుంటే చాలాచాలా నవ్వొస్తుంటుంది. ఇద్దరం కలిసినప్పుడు ఆ విషయం గుర్తు చేసుకుంటూంటాం' అని చెప్పాడు రామ్‌చరణ్‌.

ప్రస్తుతం రామ్‌చరణ్‌ 'ఎవడు' షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. శ్రుతిహాసన్‌, అమీ జాక్సన్‌ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే రెండు పాటల్ని స్విట్జర్లాండ్‌, బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. షూటింగ్ కార్యక్రమాలు తుది దశకు చేరాయి. కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్‌, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌, కూర్పు: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X