twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గజిని' డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేసిన రామ్ చరణ్ ...?!

    By Sindhu
    |

    ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ నిర్మిస్తున్న తాజా చిత్రం '7 ఏం అరివు'. సూర్య, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 'సెవెంత్ సెన్స్' పేరుతో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ తెలుగులోకి అనువదిస్తోంది. ఎనిమిది నెలలు రీసర్చ్ చేసి మరీ ఈ చిత్ర కథ తయారుచేశాననీ, గతంలో తాను రూపొందించిన గజనీ సినిమా కన్నా ఇది నాలుగైదు రెట్లు బాగుంటుందనీ యూనిట్ సభ్యలు సమాచారం. కాగా నిన్న సాయంత్రం సెవెంత్ సెన్స్ ఆడియో కార్యక్రమం హైదరాబాదులోని వెస్ట్రన్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిథి గా విచ్చేశారు, ఇంకా రాజమౌళి, సూర్య, శృతి హాసన్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ అంబికా కష్ణ మొదలగు వారు ముఖ్య అతిథులు గా విచ్చేశారు.

    ఈమధ్య రామ్ చరణ్ తేజా ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లినా అక్కడి దర్శకులని తెగ పొగిడేస్తున్నాడు. వాళ్లతో తనకూ ఓ సినిమా చేయాలని ఉందంటూ కొసమెరుపు కూడా ఇస్తున్నాడు. నిన్న కూడా అలాగే 'సెవెంత్ సెన్స్' డబ్బింగ్ సినిమా ఆడియో ఫంక్షన్లో ఆ సినిమా దర్శకుడు మురుగదాస్ ని ఆకాశానికి ఎత్తేశాడు. 'ప్రతి హీరో మీ దర్శకత్వంలో చేయాలని కోరుకుంటాడు. నేనూ అలాగే కోరుకుంటున్నాను. ప్లీజ్... నాతో ఓ సినిమా చేయండి..." అంటూ మురుగదాస్ ని చరణ్ రిక్వెస్ట్ చేశాడు.

    అయ్యప్ప దీక్షలో వున్న చరణ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చి, ఆడియోను రిలీజ్ చేశాడు. హైదరాబాదులో ఈ (శుక్రవారం) సాయంకాలం జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా చిత్ర హీరో హీరోయిన్లు సూర్య, శృతి హాసన్, సంగీత దర్శకుడు హేరిస్ జైరాజ్, కార్తీ, అల్లు అర్జున్, శర్వానంద్ తదితరులు పాల్గొన్నారు. 'సిజ్లింగ్' ఉదయభాను ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

    English summary
    Surya and Shruti Haasan starrer ‘Ellam Arivu’, the Tamil film directed by Murugadoss is being dubbed into Telugu as ‘Seventh Sense’. The Telugu version is produced by Bellamkonda Suresh under Lakshmi Ganapathi Films banner. The audio of this film was released today in Western Hotel in Hyderabad. Surya, Shruti Haasan, Murugadoss, SS Rajamouli. VV Vinayak, Harris Jayaraj, Karthi, Ram Charan Tej, Allu Arjun, Allu Aravind, Ambika Krishna, Parachuri Venkateswara Rao, Bhuvanachandra and others attended the audio launch. Ram Charan Tej released the first CD and presented it to Karthi. The first song was released by Allu Aravind, the 2nd song by SS Rajamouli and the 3rd song by Karthi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X