జూన్‌లో రామ్ చరణ్, ఉపాసన వివాహం
సినీ నటుడు రామ్‌చరణ్ పెళ్లి జూన్‌లో హైదరాబాద్‌లో ఉంటుందని అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఆయన సోమవారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉపాసన, రామ్‌చరణ్‌లది చక్కని జంట అని ప్రశంసించారు. పెళ్లి ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నామన్నారు. తనకు తిరుపతి పుట్టినిల్లు లాంటిదని చిరంజీవి చెప్పడంతో దైవం చెంతనే రిసెప్షన్‌ను తన స్వగ్రామమైన అర్ధగిరిలో ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.
ఇందుకు చిరంజీవి కూడా సుముఖత తెలిపారన్నారు. తిరుమల వెంకన్న, కాణిపాకం వినాయకుడు, అర్ధగిరి ఆంజనేయుడి ఆశీస్సులు నవదంపతులకు ఉంటాయన్నారు. అంతకు ముందు ఆయన కుటుంబసమేతంగా రాత్రి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. నటి తమన్నా కూడా సోమవారం రాత్రి స్వామివారి సేవలో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











