నాన్ బాహుబలి రికార్డుల దిశగా రాంచరణ్ సినిమా.. విడుదలకు ముందే 56 కోట్లు!

Recommended Video

Vinaya Vidheya Rama Film Sets A Record in Telugu Cinema | Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. విడుదల సమయం దగ్గరపడే కొద్దీ ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. సంక్రాంతి కానుకగా వినయ విధేయ రామ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి శ్రీను, రాంచరణ్ కాంబినేషన్ రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. పండగ వాతావరణంలో ప్రేక్షకులను ఎంజాయ్ చేసే అద్భుతమైన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ స్టార్ కాస్టింగ్ తో రాబోతున్న ఈచిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డుల దిశగా సాగుతోంది.

ఎగబడుతున్న డిస్ట్రిబ్యూటర్లు

ఎగబడుతున్న డిస్ట్రిబ్యూటర్లు

వినయ విధేయ రామ చిత్ర థియేట్రికల్ హక్కుల కోసం బయ్యర్లు ఎగబడుతున్నారు. అసలే సంక్రాంతి సీజన్. పైగా రాంచరణ్ క్రేజ్, బోయపాటి శ్రీను చిత్రాలకు మాస్ జనాల్లో ఉన్న మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఎంత మొత్తానికైనా ఏ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి బయ్యర్లు ఎగబడుతున్నారు. వినయ విధేయరామ చిత్రానికి నెలకొన్న డిమాండ్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.

హిందీ శాటిలైట్ హక్కులు

హిందీ శాటిలైట్ హక్కులు

వినయ విధేయ రామ శాటిలైట్ హక్కుల గురించి గతంలోనే వార్తలు వినిపించాయి. ఈ చిత్రం కోసం భారీ ధర వెచ్చించేందుకు ప్రముఖ హిందీ టెలివిజన్ సంస్థలు ఎగబడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్ర హిందీ శాటిలైట్ హక్కుల డీల్ 22 కోట్లకు కుదిరినట్లు తెలుస్తోంది. బాహుబలిని మినహాయిస్తే ఇది తెలుగులో రికార్డు మొత్తం అని చెప్పొచ్చు.

నైజాంలో నాన్ బాహుబలి రికార్డ్

నైజాంలో నాన్ బాహుబలి రికార్డ్

రంగస్థలం చిత్రం సాధించిన విజయం, నైజాంలో రాంచరణ్ కు ఉన్న మార్కెట్ దృష్టిలో పెట్టుకుని వినయ విధేయ రామ థియేట్రికల్ హక్కులు నైజాం బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. బయ్యర్లు ఈ ప్రాంతంలో 24 కోట్ల భారీ ధర వెచ్చించి వినయ విధేయరామ హక్కులు సొంతం చేసుకున్నారట. రంగస్థలం చిత్రం నైజాంలో 27 కోట్ల షేర్ వసూలు చేసింది. రాంచరణ్ గత చిత్రాలకు కూడ ఈ ఏరియాలో మంచి రికార్డ్ ఉంది.

విడుదలకు ముందే 56 కోట్లు

విడుదలకు ముందే 56 కోట్లు

ఇక తెలుగు సినిమాకు భారీ మార్కెట్ ఉన్న మరో ప్రాంతం ఉభయ గోదావరి జిల్లాలు. ఈ ఈస్ట్, వెస్ట్ లో కలిపి వినయ విధేయ రామ చిత్రాన్ని 10 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీనితో ఇప్పటివరకు జరిగిన మొత్తం ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారా విడుదలకు ముందే వినయ విధేయ రామ చిత్రం 56 కోట్లు రాబట్టినట్లు అయింది. సంక్రాంతి సీజన్ లో విడుదల కానుండడంతో ఏ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల బిజినెస్ తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X