చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెన్సీ వార్తల్లో స్పష్టత ఏర్పడింది!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భం దాల్చిందంటూ ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల అల్లు అర్జున్-స్నేహ దంపతులు ఓ బిడ్డకు జన్మనివ్వడంతో....రామ్ చరణ్-ఉపాసనలపై ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అవన్నీ నిరాధారమైన వార్తలని తేలిపోయింది.
రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరయ్యారు. ఇక్కడ ఉపాసనను గమనించిన చాలా మంది....ఉపాసన గర్భం దాల్చలేదని స్పష్టంగా చెబుతున్నారు. ఆమె గర్భం దాల్చినట్లు ఇటీవల వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చేసారు.

రామ్ చరణ్, ఉపాసన వివాహం జూన్ 14వ తేదీ 2012న జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన వారి వారి ప్రొఫెషన్లో బిజీగా ఉన్నారని, తల్లిదండ్రులయ్యే ఆలోచన చేయడం లేదని వారి సన్నిహితులు అంటున్నారు.
రామ్ చరణ్ విషయానికొస్తే....ప్రస్తుతం చరణ్ 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో నటిస్తున్నాడు. కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది.


Click it and Unblock the Notifications











