చెర్రీకి ఇద్దరు పిల్లలు-ఆశ్చర్యకర విషయాలు (వీడియో)
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ఇప్పటి వరకు అభిమానులకు, ప్రేక్షకులకు తెలియన సంగతులు త్వరలో కనువిందు చేయబోతున్నాయి. ప్రముఖ జాతీయ చానల్ 'టైమ్స్ నౌ' నిర్వహిస్తున్న 'స్టార్' కార్యక్రమంలో ఈ సారి రామ్ చరణ్ కనిపించబోతున్నారు.
ఈ షోలో రామ్ చరణ్ రియల్ లైఫ్ గురించి మనకు తెలియని విషయాలు చూపెట్టనున్నారు. ఒక రకంగా రామ్ చరణ్ అభిమానులకు ఇదొక కనువిందు కార్యక్రమం అని చెప్పొచ్చు. 60 నిమిషాల పాటు సాగే ఈ షోలో రామ్ చరణ్ జీవితానికి సంబంధించిన ఆశ్యర్యకర విషయాలు, ఇప్పటి వరకు చూడని ఫోటోలు డాక్యుమెంటరీగా చూపెట్టనున్నారు.
<center><iframe width="640" height="360" src="http://www.youtube.com/embed/iUEMHarnCYA?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల చేసారు. ఇందులో రామ్ చరణ్ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గుర్రం, కుక్క పిల్లతో గడుతూ కనిపించారు. ఇందులో చరణ్ మాట్లాడుతూ 'నా గుర్రం పిల్ల కెమెరా ఫ్రెండ్లీ కాదు...సారీ, నా దృష్టిలో ఇది కూడా దాదాపుగా మనిషే. తన చుట్టూ జనాలు చేరి అరవడం అంటే దానికి నచ్చదు. నాదగ్గరున్న ఈ కుక్క, గుర్రాన్ని నా సొంత పిల్లల్లా చూసుకుంటా' అని వ్యాఖ్యానించారు.
ఈ షోలో ఈ వీకెండ్(ఆగస్టు 10, 11)న టైమ్స్ నౌ ఛానల్లో ప్రసారం కానుంది. రణబీర్ కపూర్, అజయ్ దేవగన్, దీపిక పడుకొనె, సోనమ్ కపూర్, రణవీర్ సింగ్ లాంటి వాళ్ల పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలను టైమ్స్ నౌ 'స్టార్' షోలో చూపించారు. తొలి సారిగా తెలుగు నుంచి స్టార్ హీరో రామ్ చరణ్ ఈ షోలో కనిపించబోతున్నారు. మరి రామ్ చరణ్ గురించిన ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఆ కార్యక్రమాన్ని మిస్ కాకుండా చూడండి.


Click it and Unblock the Notifications











