అమితాబ్ సినిమాతో..రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ..ఇప్పటికే తెలుగులో సక్సెస్ ఫుల్ యువ హీరోగా ఎదిగాడు. అయితే తాను నాన్నలా కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా బాలీవుడ్ లో తన సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్నాడు. ఫరుఖ్ కబీర్ 'జంగిల్" సినిమా ద్వారా చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గతంలో వార్తలు వచ్చినా ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అటకెక్కింది. దీంతో మరో బాలీవుడ్ ప్రాజెక్టు కోసం గత కొంత కాలంగా ట్రై చేస్తున్న చరణ్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'జంజీర్"పై కన్నేశాడు. జంజీర్ బాలీవుడ్ రీమేక్ లో చరణ్ త్వరలో బాలీవుడ్ తెరపై మెరవ బోతున్నాడు. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ మేరకు బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ మెహతా ఈ రీమేక్ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై చరణ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు యాక్షన్ హీరోయిగా, లవర్ బాయ్ గా తెరపై మెరిసిన రామ్ చరణ్ ఈ సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించ బోతున్నాడు. జంజీర్ సినిమాలో అమితాబ్ పోషించిన నీజాయితీగల దొంగ.. విజయ్ పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. గత సినిమాను ఉన్నది ఉన్నట్టుగా కాకుండా రామ్ చరణ్ ఇమేజ్ కు సరిపడే విధంగా కథలో చిన్నపాటి మార్పులు చేయనున్నారట. చరణ్ బాలీవుడ్ ఎంట్రీ త్వరగా జరుగడానికి ఆయన తండ్రి చిరంజీవి చాలా రోజుల నుంచి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. తన ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించి చరణ్ భవిష్యత్ ను బంగారు మయం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. చరణ్ బాలీవుడ్ ఎంట్రీ సక్సెస్ అయితే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో నిలదొక్కుకున్న తొలి తెలుగు హీరోగా చరణ్ రికార్డు సృస్తాడేమో?


Click it and Unblock the Notifications











