శ్రీలంకలో రచ్చ చేయనున్న రామ్ చరణ్...తమన్నా..!

By Sindhu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించతలపెట్టిన చిత్రం 'రచ్చ'. ఈ చిత్ర షూటింగ్ జూన్ 1న ప్రారంభం కానుంది. తరవాత జూన్ 3 నుండి శ్రీలంకలో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ప్రస్తుతం చిత్ర యూనిట్ శ్రీలంకలో లోకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉందని తెలుస్తుంది.

పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా, రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాను శరవేగంగా పూర్తిచేయనున్నట్లు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ' సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X